ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

  • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ నివాళి
  • అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారని కితాబు 
  • ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. పేద, అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పని చేశారని కితాబునిచ్చారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం పేదల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిందని అన్నారు. 

చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని మోదీ కొనియాడారు. ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ కన్న కలలను సాకారం చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

NTR
NTR Jayanthi
Narendra Modi
Telugu Desam Party
Telugu Cinema
Public welfare
Good Governance
Andhra Pradesh Politics

More Telugu News